కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద పోలీసు బందోబస్తు తొలగింపు!

  • రామనగర జిల్లా ఎస్పీ బదిలీ
  • కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న చోట బందోబస్తు తొలగింపు
  • హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొన్ని రోజుల్లో అసెంబ్లీలో బల నిరూపణ ఎదుర్కోవాల్సి ఉన్న కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకుని షాక్‌ ఇస్తున్నారు. రామనగర జిల్లా ఎస్పీని వేరే ప్రాంతానికి బదిలీ చేసి, తమకు సన్నిహితుడైన చిక్‌మగళూరు ఎస్పీ అణ్ణామలైని ఆ జిల్లాకు బదిలీ చేశారు.

అలాగే, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్ల వద్ద పోలీసు బందోబస్తును తొలగించారు. దీంతో మైసూరు రోడ్డులోని ఈగల్‌టన్‌ రిసార్ట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రక్షణగా ఉండేందుకు స్థానిక కార్యకర్తలు వచ్చారు. పోలీసు రక్షణ తొలగించడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Go Back to Shorts
yaddyurappa
Karnataka
Congress

More Telugu News